- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు బేడీలు వేయడం పాపమే.. అందులో మేమందరం భాగమే: ఎమ్మెల్సీ కవిత
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై, జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై, జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కవిత (Jagruti Chief, MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. "గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరం. ఆ పాపంలో మేమందరం భాగమే" అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు.
ఖమ్మం జిల్లాలో గతంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఉదంతాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు ఇలా బహిరంగంగా గత తప్పిదాలను ఒప్పుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యల ద్వారా రైతులకు మరింత చేరువయ్యేందుకు, గతంలో జరిగిన ప్రతికూల ప్రచారాన్ని చెరిపి వేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్షమాపణలపై అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
Read More..
నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ క్లోజ్.. సాలిడ్ ఎవిడెన్స్ సంపాదించిన సిట్






