- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ క్లోజ్.. సాలిడ్ ఎవిడెన్స్ సంపాదించిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని ఇవాళ్టి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయిన ప్రభాకర్ రావును హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) లోతుగా విచారించింది.
పెన్‌డ్రైవ్‌లో కీలక డేటా గుర్తింపు..
గత వారం రోజుల విచారణలో ఆయన సాంకేతిక ఆధారాలు, పెన్ డ్రైవ్‌లో ఉన్న డేటా, ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వివరాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక సాలిడ్ ఎవిడెన్స్ (Solid Evidence)గా భావిస్తున్న పెన్‌డ్రైవ్‌లో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు, వారికి సంబంధించి పర్సనల్ డేటాను సిట్ గుర్తించింది. కాగా, ఇదే కేసులో ఇటీవల మాజీ సీఎస్ సోమేష్ కుమార్ (Somesh Kumar), మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ (Naveen Chand), ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సిట్ విచారించింది. తాజాగా, ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్, మరికొంతమంది నాయకులకు నోటీసులు, ఛార్జ్‌షీట్లు, అరెస్టులు చేసే అవకాశం ఉంది.






