- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ అక్రమాలకు అడ్డా.. తాండూరు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ పార్టీపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ పార్టీపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పైలట్ రోహిత్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌజ్ అక్రమాలకు అడ్డాగా మారింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో రోహిత్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టారు. రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తుందో.. లేదో చూడాలి. తాము తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నాం. ఈ కేసును ఇంతటితో వదిలిపెట్టం. డ్రగ్స్ తీసుకున్న అందరినీ కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తోంది’ అని మనోహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి సహా పలువురు వ్యాపారవేత్తలు, ఒక మహిళ పోలీసులకు చిక్కారు. ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్‌లకు పాజిటివ్ అని తేలింది. ఓ వైపు ప్రభుత్వాలు డ్రగ్స్ వ్యతిరేక పోరాటాలు చేస్తుంటే.. ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






