సంక్రాంతి వేళ ప్రయాణికులకు తీపి కబురు.. ఇక స్వగ్రామాలకు టోల్ ఫ్రీ ప్రయాణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-30 10:28:17  IST  )

సంక్రాంతి పండగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోంది.

సంక్రాంతి వేళ ప్రయాణికులకు తీపి కబురు.. ఇక స్వగ్రామాలకు టోల్ ఫ్రీ ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranti) పండగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీపికబురు చెప్పబోతోంంది. ఈ మేరకు నేషనల్ హైవేలపై వెళ్లే వారికి టోల్ ఖర్చులను పూర్తిగా తగ్గించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఇందుకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించి సాయంత్రం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ (NH-65) హైవేలోని పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల వద్ద ఎప్పుడూ ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించి, సాఫీగా ప్రయాణం చేసేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి సమయంలో హైవేలపై ప్రయాణించే వారి టోల్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరించాలని యోచిస్తోంది. తాజా నిర్ణయంతో ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడ మార్గాల్లో వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు బెనిఫిట్ కలగనుంది.

అయితే, జాతీయ రహదారుల టోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నారు. ఆ లేఖలో సంక్రాంతి పండగ రోజుల్లో టోల్ రాయితీ లేదా పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరనున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే సంక్రాంతి సందర్భంగా హైవేలపై ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులు త్వరగా ఇంటికి చేరుకోనున్నారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని రాష్ట్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

READ MORE ....

సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

Next Story