పంచాయతీ కార్యదర్శులకు తీపికబురు.. రూ.104 కోట్ల బిల్లులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-29 04:57:46  IST  )

దసరా పండుగ వేళ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది.

పంచాయతీ కార్యదర్శులకు తీపికబురు.. రూ.104 కోట్ల బిల్లులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ వేళ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretaries)కు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ మేరకు గతంలో మునుపెన్నడూ లేని విధంగా పెండింగ్‌లో ఉన్న రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరికొద్దిసేపట్లో పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో విడుదలైన నిధులు జమ కానున్నాయి. అయితే, తాజాగా పెండింగ్ బిల్లులను విడుదల చేసిన నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే నిధుల విడుదలపై స్పందించడం సంతోషంగా ఉందని సీతక్కఅన్నారు.

Read More..

‘స్థానిక’ ఎన్నికలకు సర్వం సిద్ధం.. కాసేపట్లో షెడ్యూల్ విడుదల!

Next Story