- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్థానిక’ ఎన్నికలకు సర్వం సిద్ధం.. కాసేపట్లో షెడ్యూల్ విడుదల!
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉదయం 10.30కి ఏసీ గార్డ్స్ కార్యలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగా షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్‌లు అన్నింటినీ పంచాయతీరాజ్ శాఖ ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘానికి అందించింది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మంద మకరంద్నోట్ ఫైల్ సిద్ధం చేసి కమిషనర్ ఆమోదానికి పంపించారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వెబ్ కాస్టింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో పోలీసులు గుర్తించిన సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ చేయనున్నారు. దీని ద్వారా పోలింగ్‌కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని, ఏదైనా ఫిర్యాదులు అందితే ఆ డేటా ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
గెజిట్‌లు విడుదల..
జిల్లాల్లో చేసిన రిజర్వేషన్ల జాబితాలను ఆయా జిల్లాలకు చెందిన జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో), జిల్లా పరిషత్ముఖ్య కార్యానిర్వహణాధికారి (జెడ్పీసీఈవో)లు రాష్ట్ర పంచాయతీరాజ్కమిషనర్కార్యాలయంలో అందజేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్లు విడుదల చేయడానికి అధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ జాబితాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఆదివారం రాత్రి ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీంతో పంచాయతీరాజ్‌శాఖ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ అంతా పూర్తి చేసింది. ఇక ఎన్నికల నిర్వహణలో ఈసీకి అవసరమైన సహాయ సహకారాలను పంచాయతీ రాజ్ శాఖ అందించాల్సి ఉంటుంది.






