Amit Shah :హైదరాబాద్‌లో ‌మకాం.. అమిత్ షా స్కెచ్ ఇదేనా!

by Disha Web Desk 4 |
Amit Shah :హైదరాబాద్‌లో ‌మకాం.. అమిత్ షా స్కెచ్ ఇదేనా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తెలంగాణపై మరింత ఫోకస్ పెంచింది. ఎలక్షన్స్ కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని భావించిన బీజేపీకి ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. పేరున్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో నేరుగా అమిత్ షా రాష్ట్రంపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. యూపీలో 2014 ఎన్నికల బాధ్యతలు చేపట్టిన అమిత్ షా ఏకంగా 71 మంది ఎంపీలను గెలిపించుకుని అటు రాష్ట్రంలో బీజేపీని టాప్ పొజిషన్‌లో ఉంచారు. ఇప్పటికి కూడా యూపీలో బీజేపీ ప్రభుత్వమే ఉండటం విశేషం. దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంలో యూపీలో గెలిచిన ఎంపీల సంఖ్య కీలకంగా మారింది.

ఇక ఇటీవల ఎంఐఎం చీఫ్ అమిత్ షా నెలకు రెండు రోజులు అమిత్ షా తెలంగాణలో ఉంటారని.. ఓ వ్యాపార వేత్త కేంద్ర హోం మంత్రి కోసం ఇల్లు కూడా కట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అలర్ట్‌గా ఉండాలని కూడా హెచ్చరించారు. సౌత్‌లో పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కోల్పోయిన తర్వాత బీజేపీ ఫోకస్ మొత్తం తెలంగాణపై మళ్లింది. అందుకే జెట్ స్పీడ్‌లో రాష్ట్రంలో పది రోజుల వ్యవధిలో రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. వరుసగా ఖమ్మం, మహబూబ్ నగర్‌లో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. మిగతా జిల్లాల్లో కన్నా ఈ రెండు జిల్లాల్లో బీజేపీ కొంత వెనకబడి ఉంది. అందుకే ఈ రెండు ఉమ్మడి జిల్లాలపై బీజేపీ హై కమాండ్ ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఖమ్మం ముఖ్య నేత పొంగులేటి బీజేపీని కాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆయనకు సైతం బీజేపీ పవర్ ఏంటో చూపాలని కాషాయం పార్టీ భావిస్తోంది.

అమిత్ షా మార్క్ స్ట్రాటజీ..

రాజకీయ చతురతతో అపర చాణక్యుడిగా పేరున్న అమిత్ షా తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో అధికార పార్టీలో సైతం టెన్షన్ మొదలైంది. స్థానిక అంశాలను నిశితంగా పరిశీలించేందుకు అమిత్ షా తెలంగాణలో మరింత సమయం ఉండనున్నట్లు తెలిసింది. తద్వారా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌ ఆవిర్భావ బహిరంగ సభకు కౌంటర్ ఇచ్చేలా ఖమ్మంలో ‘మహా జన్ సంపర్క్ అభియాన్’ ను బీజేపీ ప్లాన్ చేసింది. ఒకే సారి అటూ పొంగులేటి, ఇటూ బీఆర్ఎస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తోంది.

అభ్యర్థుల విషయంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనే అంశంపై అమిత్ షా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. స్థానికంగా ప్రభావితం చేేసే అంశాలు వాటికి కౌంటర్‌గా ఇవ్వాల్సిన హామీలపై అమిత్ షా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. మహబూబ్ నగర్‌లో జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోడీ సైతం హైదరాబాద్‌లో భారీ రోడ్డు షో నిర్వహించనున్నట్లు సమాచారం. ఖమ్మం బహిరంగ సభ సమయంలోనే రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నాహాలపై అమిత్ షా బీజేపీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తానికి తెలంగాణలో వరుసగా ముగ్గురు బీజేపీ ముఖ్యనేతల పర్యటనలతో మరోసారి రాజకీయ వాతావరణం వేడక్కనుంది.

Read more: వలస పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయి: KCR


Next Story

Most Viewed