- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: ఐసీయూలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి!
దేశ రాజధాని ఢిల్లీలని ఓ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవదహనమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకముందే.. బిహార్ లోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలని ఓ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవదహనమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకముందే.. బిహార్ లోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ముజఫర్ పూర్ జిల్లాలో ఉన్న ప్రసాద్ ఆస్పత్రి భవనంలో ఐదవ అంతస్తులో ఉన్న ICUలో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఫైర్ యాక్సిడెంట్ పై సమాచారం అందగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐసీయూ నుండి సుమారు 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో అత్యవసరంగా చికిత్స పొందుతున్నవారిని సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముజఫర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ.. "ఐసీయూలో దాదాపు 13 మంది రోగులు ఉన్నారు, మరికొందరు సీసీయూ (CCU)లో చేరారు. దర్యాప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.






