- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన విజయ్ ఆంటోనీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొంతకాలం క్రితం తమిళగ వెట్రి కజగం (TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందుతూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన విస్తృతంగా సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు సినీ ప్రముఖులతో కూడా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ముఖ్యమంత్రి విజయ్‌ను ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన విజయ్ ఆంటోనీ, భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. అలాగే “గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు గర్వంగా కూడా అనిపించింది. ప్రజలకు సేవలు అందించే దిశగా ఆయనకు మరింత బలం, అపారమైన శక్తి లభించాలని కోరుకుంటున్నాను” అంటూ విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు. ఇక విజయ్ హీరోగా తెరకెక్కిన ‘వేట్టైక్కారన్’, ‘వేలాయుధం’ చిత్రాలకు విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన విషయం తెలిసిందే.






