త్వరలో జీతాలు పెంచుకుందాం: సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
త్వరలో జీతాలు పెంచుకుందాం: సీఎం కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుదామని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో ఉద్యోగుల జీతాలను పెంచుకుందామన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని ఈ విజయం అందరం సమిష్టిగా పని చేస్తేనే సాధ్యమైందన్నారు.

తాము హైదరాబాద్ లో కూర్చుని ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసినా వాటిని విజయవంతం చేసిన ఘనత ఉద్యోగులకు చెందుతుందన్నారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. వలసల పాలమూరు జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్లలో అనేక అద్భుతాలు జరిగాయని కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పారు. అనేక పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ అన్ని విషయాల్లో ముందు వరుసలో ఉందని దేశంలో వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం హైదరబాద్ లోనే ఉన్నాయన్నారు.

Read more: హైదరాబాద్‌లో ‌మకాం.. అమిత్ షా స్కెచ్ ఇదేనా!


Next Story

Most Viewed