- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ.. రవాణా శాఖ కీలక ఆదేశాలు
తెలంగాణలో వరి ధాన్యం రవాణాకు ఆటంకాలు కలగకుండా రవాణా శాఖ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, రవాణాలో ఎలాంటి అడ్డంకులు కలగకుండా చూసేందుకు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లైస్ (Civil Supplies) విభాగం విజ్ఞప్తి మేరకు.. జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని జిల్లా రవాణా అధికారులను (DTOs) ఆదేశించింది. ధాన్యం సేకరణ కేంద్రాల నుండి నిల్వ కేంద్రాలు, రైస్ మిల్లులకు రవాణా సాఫీగా సాగేందుకు.. ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడానికి తగినన్ని సరుకు రవాణా వాహనాలను (Goods Vehicles) అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
వాహనాల కేటాయింపు, తరలింపులో ఎలాంటి జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి ఉత్వర్వులలో పేర్కొన్నారు. రవాణాలో పాల్గొనే అన్ని వాహనాలకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలన్నారు. వాహనాల కదలికలో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా అధికారుల సాయంతో తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. రవాణా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ, క్రమం తప్పకుండా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థలో ఎక్కడా అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా రవాణా కమిషనర్ ఇలంబరితి ఈ ఆదేశాలు జారీ చేశారు.
‘నేను ఏసీ గదిలో కూర్చుని మాట్లాడటం లేదు’.. మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్






