బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు పై రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలి : సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ

by Ratna Kumari |   (  Updated:2026-01-08 10:52:07  IST  )

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తి మాటలు చెప్పటం మాని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకత్వంతో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు పై రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలి :  సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ
X

దిశ, అచ్చంపేట : రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తి మాటలు చెప్పటం మాని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకత్వంతో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయ‌న హాజ‌రై మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కపట ప్రేమలు నిలిపివేసి వారికి రాజ్యాంగం ప్రకారం.. రావాల్సిన హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవల వెనిజులా అధ్యక్షుడు ఆయన సతీమణి అమెరికా అధ్యక్షుడు అరెస్టు చేస్తే దేశ ప్రధాని మోదీ ఆ ఘటనపై నోరు మెదకపోవడాన్ని విమర్శిస్తూ.. ఆ సంఘటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు లభించే ఉపాధి హామీ పథకాన్ని గతంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించేవని కానీ నేడు మోడీ ప్రభుత్వం కూలీలను పొట్ట కొట్టే విధంగా పథకాన్ని సమీకరణలు చేస్తూ 60% నిధులు కేటాయించడం సరైనది కాదని ఆ విధానం విడతల వారీగా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపుతుందని ప్రధానంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కార్మికుల సమ్మె చేసుకునే హక్కును సైతం కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం విధానాలను అమలు చేస్తుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఆ ప్రాజెక్టు 90 శాతం పూర్తి కాలేదు..

ఉమ్మడి పాలమూరు జిల్లా తో పాటు రంగారెడ్డి జిల్లాకు సశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. తొంబై శాతం ఎలా పూర్తయిందో గత ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం ప్రశ్నిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు 80 వేల కోట్ల నిధులు కేటాయిస్తే.. కేవలం 30 వేల కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయని దానిని బట్టి 90% ఆ ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందో వారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం సత్వరమే పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. అలాగే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం చెందిందని విమర్శించారు. కావున ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మానాయక్ జిల్లా నాయకులు శ్రీను, అంజనేయులు, దేశ్య నాయక్, శంకర్ నాయక్, సైదులు, సయ్యద్, దశరథం, మల్లేష్, ఉన్నారు.

Read More... TG: మున్సి‘పోల్స్‌’‌కు వడివడిగా అడుగులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ భేటీ


Next Story