- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: తెలంగాణ బీజేపీలో మరోసారి సినీ గ్లామర్ డోస్.. కాషాయ గూటికి స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ తెలంగాణ బీజేపీలోలో చేరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) సినీ గ్లామర్ మరోసారి చర్చగా మారింది. తాజాగా ఆ పార్టీలో నాటి స్టార్ హీరోయిన్ ఆమని (Aamani Joins BJP) చేరారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన ప్రజా పోరాటాల విషయంలో అటుఇటు అన్నట్లు నెమ్మదిగా పోరాటాలు సాగిస్తున్న బీజేపీ ఇప్పుడు సినీ తారలను పార్టీలో చేర్చుకునేందుకు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపడంతో తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది.
పార్టీ కండువా కప్పుకున్న స్టార్ హీరోయిన్:
ఆమని బాటలో మరికొంత మంది స్టార్ యాక్టర్స్ బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇదే తరహా సినీ గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. జయసుధ, విజయశాంతి, జీవిత రాజశేఖర్‍తో పాటు మరికొంత మంది కాషాయదళంలో చేరారు. వీరితో పాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సెలబ్రెటిల ఇంటికి నేరుగా బీజేపీ అగ్రనేతలు వెళ్లడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజేయేంద్రప్రసాద్‍ను ఏకంగా రాజ్యసభకు పంపింది. ఇలా పలువురు సినీ తారలను, సినీ రంగ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీలో పాజిటివ్ వైబ్ తెప్పించే ప్రయత్నం చేసింది. అయితే వీరిలో విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్‍లో చేరి ఎమ్మెల్సీ చాన్స్ కొట్టేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులను పార్టీలోకి చేర్చుకుంటూ వస్తున్న బీజేపీ సడెన్‍గా సినీతారలవైపు ఫోకస్ పెట్టడంతో కలమనాథులు వ్యూహం ఏమిటి? అనేది ఆసక్తి రేపుతోంది.
READ MORE ....
ఉపాధిహామీ పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది: రామచంద్రరావు






