Jubilee Hills: షేక్‍పేట డివిజన్‍లో కాంగ్రెస్ దే పై చేయి... కాంగ్రెస్‍ను బీఆర్ఎస్ ఓవర్ టేక్ చేసేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-11-14 04:26:33  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది.

Jubilee Hills: షేక్‍పేట డివిజన్‍లో కాంగ్రెస్ దే పై చేయి... కాంగ్రెస్‍ను బీఆర్ఎస్ ఓవర్ టేక్ చేసేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం వెలువడుతోంది. షేక్‍పేట డివిజన్‍కు (Sheikh Peta Division Counting) చెందిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్ల రాగా బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ కు 1144 ఓట్ల ఆధిక్యత లభించింది. అయితే రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీకి కేవలం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. షేక్‍పేట డివిజన్‍లో మొత్తం 31,182 ఓట్లు పోలవగా ఇక్కడ స్వల్ప కాంగ్రెస్ పై చేయి సాధించింది. అయితే షేక్ పేటను కాంగ్రెస్ మొదటి నుంచి దృష్టి సారించింది. ఈ డివిజన్ లో మరింత ఎక్కువ లీడ్ సాధించేలా లెక్కలు వేసుకున్నప్పటికీ 1,144తో బీఆర్ఎస్ అభ్యర్థి మీద పై చేయి సాధించింది. అయితే షేక్‍పేటలో సైలెంట్ ఓటర్లంతా తమ వైపే నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్‍కు షాక్ తగిలింది. దీంతో వెంగళరావు, సోమాజిగూడ డివిజన్ల ఓట్లను లెక్కించబోతున్నారు. ఇక్కడ క్లాస్ సెక్షన్, సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఈ ఓట్లు ఎవరికి పడతాయి? కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థి ఓవర్ టేక్ చేయగలుగుతారా అనేది వేచి చూడాలి.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

Jubilee Hills: ముగిసిన రెండు రౌండ్ల కౌంటింగ్.. కాంగ్రెస్‌కు 1,144 ఓట్ల ఆధిక్యం

Next Story