రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం.. అధికారిక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 06:49:03  IST  )

తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బి.శివధర్ రెడ్డి నియమితులయ్యారు.

రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం.. అధికారిక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా, సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాలో పదవీ విరమణ పొందిన ఆయన ఈ నూతన బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం జీవో నెం.559ను విడుదల చేసింది.

మూడేళ్ల కాలపరిమితి.. కీలక బాధ్యతలు

రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన ప్రధానంగా పోలీసు యంత్రాంగం, శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, నార్కోటిక్స్ కంట్రోల్, రోడ్డు భద్రత లాంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించనున్నారు. అదేవిధంగా శివధర్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ హోదాతో పాటు నెలకు రూ.2.25 లక్షల వేతనాన్ని చెల్లించనున్నారు. నివాస సదుపాయానికి అదనంగా నెలకు రూ.50 వేల ఇంటి అద్దె భత్యం (HRA) పొందుతారు. ప్రభుత్వ వాహనంతో పాటు పదవీ విరమణకు ముందు పొందిన విధంగానే TA, DA, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు శివధర్ రెడ్డికి వర్తించనున్నాయి.

ప్రత్యేక కార్యాలయం.. సిబ్బంది కేటాయింపు

రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి కార్యకలాపాల కోసం హోంశాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. ఇందులో ఒక ఓఎస్‌డీ (OSD), ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉంటారు. ఈ నియామకానికి సంబంధించిన ఖర్చులను హోం శాఖ బడ్జెట్ నుంచి భరించనున్నారు. దీంతో రాష్ట్రంలో అంతర్గత భద్రత, శాంతిభద్రతల విషయంలో శివధర్ రెడ్డికి ఉన్న అపారమైన అనుభవం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో దోహదపడనుంది.

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన CV ఆనంద్.. నక్సలిజంపై సంచలన వ్యాఖ్యలు

Next Story