డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన CV ఆనంద్.. నక్సలిజంపై సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 06:42:11  IST  )

తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ దేశంలో నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన CV ఆనంద్.. నక్సలిజంపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను డీజీపీగా ఎంపిక చేసినందుకు సీఎంతో రేవంత్ రెడ్డి‌తో, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీసులు దశాబ్దాలుగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను కొనసాగించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం నిర్దేశించి ప్రాధాన్యత అంశాలపై తాను దృష్టి సారిస్తానని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు విభాగం తన కార్యాచరణను పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకున్న నేపథ్యంలో పోలీసు కార్యకలాపాలలో మార్పులు తీసుకురావాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ప్రస్తుత తెలంగాణ (Telangana) రాష్ట్రాలు నక్సలిజాన్ని నియంత్రించడంలో దేశానికే మార్గదర్శకులుగా నిలిచాయని కొనియాడారు. కేవలం నిర్బంధ చర్యలే కాకుండా, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, ఉపాధి అవకాశాలు చూపడం వంటి ప్రభుత్వ విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీవ్ర ప్రయత్నాల వల్ల దేశంలో నక్సలిజం సమస్య త్వరలోనే ముగిసిపోయే దశకు చేరుకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసుల ఖ్యాతిని మరింత పెంచుతానని నూతన డీజీపీ సీవీ ఆనంద్ కామెంట్ చేశారు.

రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం.. అధికారిక ఉత్తర్వులు విడుదల

Next Story