- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mangli : మంగ్లీ FIR కాపీలో సంచలన విషయాలు
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్ డే వేడుకల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్ డే వేడుకల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లోని చేవెళ్ల శివారు ఈర్లపల్లిలో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో జరిగిన మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన FIR కాపీలో సంచలన విషయాలు వెలుగులో వచ్చాయి. ఇంతకీ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందంటే.. 'స్థానికులు రాత్రి 1 గంట సమయంలో పెద్దపెద్ద సౌండ్‌తో హంగామా జరుగుతోందని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో మహిళా ఎస్సై నేతృత్వంలో పోలీసులు రిసార్ట్‌కు వెళ్లగా, అక్కడ 10 మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. రిసార్ట్ మేనేజర్ ఈ కార్యక్రమం మంగ్లీ బర్త్‌డే పార్టీగా నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పాడు. పోలీసులు ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. దీనికి కూడా అనుమతి లేనట్లు తేలింది. మంగ్లీని విచారించగా.. ఆమె పార్టీ, మద్యం, డీజేలకు అనుమతి లేనట్లు ఒప్పుకున్నారు.
పోలీసులు అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఒక వ్యక్తికి గంజాయి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంగ్లీ, రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్‌లపై అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, విదేశీ మద్యం వినియోగం, గంజాయి వాడకం ఆధారంగా కేసు నమోదు చేశారు. పోలీసులు విదేశీ మద్యాన్ని సీజ్ చేసి, ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Read More..
Singer Mangli: లిక్కర్ పార్టీలో దురుసు ప్రవర్తన..మంగ్లీకి తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్






