- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Singer Mangli: లిక్కర్ పార్టీలో దురుసు ప్రవర్తన..మంగ్లీకి తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్
ఫోక్ సింగర్ మంగ్లీకి తెలంగాణ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్లలోని రిసార్ట్‌లో స్నేహితులకు పార్టీ ఇవ్వగా అందులో మద్యంతో పాటూ గంజాయి వాడినట్టు పోలీసులు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: ఫోక్ సింగర్ మంగ్లీకి తెలంగాణ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్లలోని రిసార్ట్‌లో స్నేహితులకు పార్టీ ఇవ్వగా అందులో మద్యంతో పాటూ గంజాయి వాడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా రిసార్ట్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో వీడియోలు తీవయవద్దంటూ మంగ్లీ దురుసుగా ప్రవర్తించింది. దీనిపై తెలంగాణ పోలీస్ ట్విట్టర్ వేధికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై పోలీసులు దాడి చేశారని పేర్కొంది.
చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సివస్తుందని హెచ్చరించింది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడం అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో బుధవారం రాత్రి ఈ పార్టీ జరిగింది.
పార్టీలో నటి దివితో పాటూ పలువురు సెలబ్రెటీలు సైతం హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు 50 మంది హాజరుకాగా 48 మందికి గంజాయి టెస్ట్ నిర్వహించారు. వారిలో 9మందికి పాజిటివ్ వచ్చింది. అంతే కాకుండా అనుమతి లేకుండా పార్టీలో విదేశీ మద్యం కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. దీంతో మంగ్లీతో పాటూ ఈవెంట్ మేనేజర్, రిసార్ట్ మేనేజర్ పైనా కేసులు నమోదు చేశారు.
Read More..
ఫోక్ సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీ.. భారీగా విదేశీ మద్యం సీజ్






