- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోక్ సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీ.. భారీగా విదేశీ మద్యం సీజ్
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ (Mangli) చిక్కుల్లో పడింది. తన పుట్టిన రోజు సందర్భంగా చెవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ లిక్కర్ పార్టీ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ (Mangli) చిక్కుల్లో పడింది. తన పుట్టిన రోజు సందర్భంగా చెవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్‌పై చెవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెయిడ్‌లో భారీగా విదేశీ మద్యాన్ని వారు సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంతో పాటు, పర్మీషన్ లేకుండా విదేశీ మద్యం వాడకంపై మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై చెేవెళ్ల పోలీసులు NDPS యాక్ట్ కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read More: మంగ్లీ మంచిదని వెళ్లా.. బర్త్ డే పార్టీ ఇష్యూపై దివి షాకింగ్ కామెంట్స్






