- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Divi : మంగ్లీ మంచిదని వెళ్లా.. బర్త్ డే పార్టీ ఇష్యూపై దివి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుక దుమారంగా మారిన సంగతి తెలిసిందే. చేవెళ్లలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరగ్గా ఆ పార్టీకి మొత్తం 50 మంది హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్:టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుక దుమారంగా మారిన సంగతి తెలిసిందే. చేవెళ్లలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరగ్గా ఆ పార్టీకి మొత్తం 50 మంది హాజరయ్యారు.పోలీసులు ఫార్మ్‌హౌస్ పై దాడి చేసి అనుమతి లేకుండా విదేశీ లిక్కర్ సప్లై చేశారని కేసు నమోదు చేశారు. అంతే కాకుండా పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి గంజాయి తీసుకున్నట్టు నిర్దారించారు. ఈ పార్టీలో మంగ్లీ సన్నిహితులతో పాటూ కొందరు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. నటి దివి కూడా బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.
దీంతో దివి ఫోటోలు మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బర్త్ డే పార్టీపై స్పందించారు. మంగ్లీ తన స్నేహితురాలు అని అమె మంచిది అని అన్నారు. మంగ్లీ పిలవడంతోనే పార్టీకి వెళ్లానని చెప్పారు. స్నేహితురాలు బర్త్ డే పార్టీ అని వెళితే అక్కడ తప్పు చేసినట్టు కాదని అన్నారు. తను ఎంతో కష్టపడి పైకి వచ్చానని కానీ ఫోటోలు వేస్తే తన కెరీర్ పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బర్త్ డే పార్టీకి వెళ్లినంత మాత్రాన అక్కడ జరిగిన తప్పులకు కారణం కాదు కదా అని వ్యాఖ్యానించారు. తన ఫోటోలను ఈ కేసుకు సంబంధించి వేయకూడదని దివి కోరారు.
Read More..
ఫోక్ సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీ.. భారీగా విదేశీ మద్యం సీజ్
Singer Mangli: లిక్కర్ పార్టీలో దురుసు ప్రవర్తన..మంగ్లీకి తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్






