కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. MP Komatireddy Venkat Reddy సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   (  Updated:2022-12-08 07:08:08  IST  )

రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. MP Komatireddy Venkat Reddy సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందే పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చింది తానే అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలని కోరారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా కేసీఆర్ కుటుంబం రాష్ట్రంమీద పడి దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్‌లో కొనసాగుదామా? లేదా? అనే దానిపై కోమటిరెడ్డి నిర్ణయం తీసుకుంటాననడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నది. ఒకవేళ కోమటిరెడ్డి పార్టీ వీడితే ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారు అవుతుందని సీనియర్లు భావిస్తున్నారు.

Read more:

Gujarat ఎన్నికల ఫలితాలపై Modi రియాక్షన్ ఇదే!

Next Story