- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో సంచలనం.. వ్యక్తిగత సహాయకుడి అనుమానాస్పద మృతి
తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) నివాసంలోని మూడో అంతస్తులో ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇంట్లో పని చేసే వ్యక్తి గంధమల్ల రవి (Gandhamalla Ravi) (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడు ఉరేసుకుని చనిపోయాడని చెబుతున్నప్పటికీ.. రవి మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కాగా, గంధమల్ల రవి యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లోని పెంట్ హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. రెండు రోజులుగా అతడు సొంత గ్రామమైన సైదాపురా (Saidapuram)నికి వెళ్లి.. శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ నేపథ్యంలోనే రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఒకవేళ అలాంటి అఘాయిత్యమే చేసుకుంటే సైదాపురంలోని చేసుకుని ఉండేవాడని సైదాపురం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. భార్యతో కలిసి మృతుడు రవి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లోనే పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే ఇంట్లో సూసైడ్..పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు






