బాలిక స్టేట్‌మెంట్‌తో మారిన సెక్షన్లు.. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-14 10:16:35  IST  )

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

బాలిక స్టేట్‌మెంట్‌తో మారిన సెక్షన్లు.. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ
X

దిశ, వెబ్‌‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసులో అరెస్టును తప్పించుకునేందుకు భగీరథ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కుట్ర అని, విచారణకు తప్పక సహకరిస్తానని పేర్కొంటూ భగీరథ్ రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ మాధవి బెంచ్ నేతృత్వంలోని ప్రత్యేక వెకేషన్ కోర్టు (Vacation Bench) విచారించనుంది.

డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణ..

అయితే, ఈ కేసును కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ (DCP Ritiraj) ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాధిత బాలిక నుంచి సేకరించిన తాజా వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై కేసు నమోదైంది. మొదట సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసినప్పటికీ, బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం (Statement) ఆధారంగా డీసీపీ రితిరాజ్ కేసులో మరికొన్ని కఠినమైన సెక్షన్లను చేర్చారు. పోలీసులు ఇప్పటికే భగీరథ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన తరుణంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా..? లేక పోలీసుల విచారణకు అప్పగిస్తుందా? అన్నది మరికాసేపట్లో తేలనుంది.

బండి భగీరథ్ ‘పోక్సో’ కేసు: బెయిల్ కోసం హైకోర్టులో వాడివేడి వాదనలు

Next Story