బండి భగీరథ్ ‘పోక్సో’ కేసు: బెయిల్ కోసం హైకోర్టులో వాడివేడి వాదనలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-14 10:42:33  IST  )

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది.

బండి భగీరథ్ ‘పోక్సో’ కేసు: బెయిల్ కోసం హైకోర్టులో వాడివేడి వాదనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. ఈ కేసులో రెండు వైపులా న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. పోలీసుల తరపున పీపీ నాగేశ్వర రావు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు పోక్సో చట్టం కింద నమోదైనప్పటికీ నిందితుడిగా ఉన్న వ్యక్తికి రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయని ఆయన వాదించారు. గతంలో ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు, వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. తాము కేసు కొట్టివేయాలని కోరడం లేదని, కేవలం ముందస్తు బెయిల్ మాత్రమే ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. పోక్సో కేసు చాలా తీవ్రమైనదని బెయిల్ ఇవ్వడం సరికాదని పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్న నాగేశ్వర రావు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బండి భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్‌పై కోర్టు రియాక్షన్ ఇదే

బాలిక స్టేట్‌మెంట్‌తో మారిన సెక్షన్లు.. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ

Next Story