బండి భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్‌పై కోర్టు రియాక్షన్ ఇదే

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-14 11:41:47  IST  )

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ కీలక మలుపు తిరిగింది.

బండి భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్‌పై కోర్టు రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. మధ్యంతర బెయిల్‌పై తీర్పును రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది. ఇక ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. విచారణ సందర్భంగా భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక వాదనలు వినిపించారు. 2021లో డ్రైవింగ్‌లో పట్టుబడిన సమయంలో బాధితురాలి వయసు 15 ఏళ్లుగా ఉందని పేర్కొన్నారు. అయితే పోలీసులు దాఖలు చేసిన ప్రస్తుత చార్జిషీట్‌లోనూ ఆమె వయసు 15 ఏళ్లుగానే పోలీసులు చూపించారని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంతేకాదు.. పోలీసుల చార్జిషీట్‌లో పేర్కొన్న బాధితురాలు పుట్టిన తేదీ, బాధితురాలి పాన్ కార్డులో ఉన్న పుట్టినతేదీ వేరు వేరుగా ఉన్నాయన్నారు. బాధితురాలి వయసు విషయంలో స్పష్టత లేని అంశాలను పరిగణనలోకి తీసుకొని భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయాలని నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై రేపు తన నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. అదే సమయంలో ప్రధాన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను వచ్చేవారం చేపడతామని స్పష్టం చేసింది.

బండి భగీరథ్‌ బెయిల్ పిటిషన్‌‍పై విచారణ.. లాయర్ల మధ్య వాగ్వాదం.. జడ్జీ తీవ్ర అసహనం

బండి భగీరథ్ ‘పోక్సో’ కేసు: బెయిల్ కోసం హైకోర్టులో వాడివేడి వాదనలు

Next Story