- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. లాయర్ల మధ్య వాగ్వాదం.. జడ్జీ తీవ్ర అసహనం
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. లాయర్ల మధ్య వాగ్వాదంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‍పై నమోదైన పోక్సో కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పును తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ కోర్టులో ఇరుపక్షాల మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా బండి భగీరథ్ తరఫు న్యాయవాది, బాధితురాలి తరఫు న్యాయవాది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బండి భగీరథ్ ను క్రిమినల్ అని బాధితురాలి తరఫు న్యాయవాది సంబోధించారు. దీంతో ఈ వ్యా్ఖ్యల పట్ల భగీరథ్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేర నిరూపణ అయ్యే వరకు నేరస్థుడు అనకూడదని, లాయర్లకు సంయమనం లేకపోతే పిటిషన్ ను మరో బెంచ్ కు మార్చుకోవచ్చని జడ్జి సూచించారు.
బాధితురాలి వయసులో తేడా ఎందుకు?:
కేసు విచారణ సందర్భంగా భగీరథ్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ 2021లో డ్రైవింగ్లో పట్టుబడినప్పుడు బాధితురాలి వయసు 15గా ఉందని ఇప్పుడు పోలీసుల చార్జిషీట్‍లో వయసు 15గా ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చార్జిషీట్, పాన్ కార్డులో పుట్టిన తేదీలు ఒక్కొలా ఎందుకున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. జనన ధ్రువపత్రాలు పరిశీలించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో మొదటి నుంచి చర్చ జరుగుతున్నట్లే న్యాయస్థానంలోనూ బాధితురాలి వయసు కీలకాంశంగా మారింది. కాగా ఇవాళ ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌పై తీర్పును రేపటికి (శుక్రవారం), ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.






