- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌కు షర్మిల పాపం
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కీలక హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కవిత పార్టీకి దూరంగా ఉండటం.. పార్టీ ఆమెను పట్టించుకోకపోవడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కీలక హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కవిత పార్టీకి దూరంగా ఉండటం.. పార్టీ ఆమెను పట్టించుకోకపోవడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కవిత ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ కవితకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. బీఆర్ఎస్‌కు కవిత షర్మిలలా మారిందని కొందరు కామెంట్లు చేస్తుండగా కొందరు బీఆర్ఎస్‌కు కవిత పాపమే తగిలిందని కామెంట్లు చేస్తున్నారు.
గతంలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణలో పర్యటనలు చేపడుతూ, సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్‌పై విమర్శలు కురిపించారు. ఆ సమయంలో షర్మిలను బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా ఓ రేంజ్‌లో విమర్శించాయి. అన్నతో విభేదాలు ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని ప్రశ్నించారు. షర్మిల ఏం మాట్లాడినా ఆమెను ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్‌లోనూ అదే పరిస్థితి వచ్చింది. కవిత బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.
నిన్నటి మీడియా సమావేశంలో కేసీఆర్ పై సీబీఐ విచారణ జరిగిన తరవాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్‌పైనా విమర్శలు చేశారు. ఇక్కడ కూడా అన్నా చెల్లెల్ల పంచాయితీ మొదలవ్వడంతో బీఆర్ఎస్‌కు షర్మిల పాపమే తగిలిందని ఆమె అభిమానులు అంటున్నారు. మీరు షర్మిలను ట్రోల్ చేసిన పాపమే ఈ రోజు కవిత రూపంలో వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. కవితను హైలైట్ చేసి పోస్టులు పెడుతూ బీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇస్తున్నారు.
Read More : బీఆర్ఎస్‌లోని దెయ్యాల పేర్లు బయటపెట్టిన కవిత.. కేసీఆర్ స్పందనపై అందరిలోనూ ఉత్కంఠ!






