విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు ఖరారు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-26 12:01:32  IST  )

తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు అయ్యాయి. జనవరి 10న రెండో శనివారం, జనవరి 11న ఆదివారం కావడం మరియు జనవరి 18న ఆదివారం కలిసి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు ఖరారు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు అయ్యాయి. జనవరి 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు సెలవులు ఖరారు చేశారు. దీంతో విద్యార్థులకు తొమ్మిది రోజులు సెలవులు రానున్నాయి. గతేడాది స్కూళ్లకు ఆరు రోజులే సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 10న రెండో శనివారం, జనవరి 11న ఆదివారం కావడం మరియు జనవరి 18న ఆదివారం కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. జనవరి 19న అంటే సోమవారం తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మరోవైపు జనవరిలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం కావడంతో ఆ రోజు సైతం సెలవు ఉంది. జనవరి 26న రిపబ్లిక్ డే కాగా ఆ రోజు సైతం హాలిడే. వీటితో పాటు నాలుగు ఆదివారాలు సెలవులే. ఇదిలా ఉంటే ఏపీలోనూ స్కూళ్లకు తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించారు.

Read More..

స్కూళ్లలో పిల్లలంతా న్యూస్ పేపర్ చదవాలి.. విద్యాశాఖ ఆదేశాలు

Next Story