స్కూళ్లలో పిల్లలంతా న్యూస్ పేపర్ చదవాలి.. విద్యాశాఖ ఆదేశాలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-26 11:19:58  IST  )

స్కూళ్లలో పిల్లలంతా న్యూస్ పేపర్ చదవాలి.. విద్యాశాఖ ఆదేశాలు

స్కూళ్లలో పిల్లలంతా న్యూస్ పేపర్ చదవాలి.. విద్యాశాఖ ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యా వ్యవస్థ(UP Education System)లో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం(UP Government) కీలక మార్పులు చేస్తోంది. తాజాగా పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో జ్ఞానం పెంపొందించాలంటే కనీసం 10 నిమిషాలు పత్రికా పఠనం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను కూడా కూడా ప్రభుత్వం వెల్లడించింది. భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొంది. అలాగే సంపాదకీయాలు చదవడం ద్వారా పదజాలం మెరుగుపడటమే కాకుండా.. సొంతంగా రాసే నైపుణ్యం పెరుగుతుందని వెల్లడించింది. అంతేకాకుండా వివిధ కోణాల్లో వచ్చే వార్తలను విశ్లేషించడం ద్వారా ఏది నిజం, ఏది అబద్ధం అనే విచక్షణ జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన కూడా అలవడుతుందని సర్కారు స్పష్టం చేసింది. స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక అంశాల గురించి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని వ్యాఖ్యానించింది. వార్తా పత్రికలలో వచ్చే సుడోకు, క్రాస్‌వర్డ్ పజిల్స్ విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, తార్కిక ఆలోచనను పెంచుతాయని పేర్కొంది.

Read More..

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు ఖరారు

Next Story