నగరంలో అర్ధరాత్రైనా ఆగని సంక్రాంతి సంబురాలు.. చుక్కలను తాకిన పతంగ్‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-16 06:43:28  IST  )

హైదరాబాద్‌లో సంక్రాంతి సంబురాలు అంబురాన్ని తాకాయి. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు రంగు రంగుల పతంగ్‌లను ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో ఆకాశంలో ఎక్కడ చూసినా గాలిపటాలే కనిపించాయి.

నగరంలో అర్ధరాత్రైనా ఆగని సంక్రాంతి సంబురాలు.. చుక్కలను తాకిన పతంగ్‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో సంక్రాంతి సంబురాలు అంబురాన్ని తాకాయి. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు రంగు రంగుల పతంగ్‌లను ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో ఆకాశంలో ఎక్కడ చూసినా గాలిపటాలే కనిపించాయి. బిల్డింగ్‌లపై డీజేలు పెట్టుకుని, ఎండ పడకుండా టెంట్లు వేసుకుని మరీ పతంగ్‌లను ఎగరవేశారు. ప్రతి ఏడాది కేవలం యువత మాత్రమే ఎక్కువగా కనిపించేవారు కానీ ఈ ఏడాది చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పతంగ్‌లు ఎగరవేశారు.

బేగంబజార్, దూల్ పేట్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే రాత్రైనా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి పతంగ్‌లు ఎగరవేస్తూనే ఉన్నారు. ఒకరి పతంగ్ లు మరకొరు కట్ చేస్తూ పార్టీలు చేసుకున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి మరీ ఎగరవేయడంతో చీకటి మాయమై పగటిపూట మాదిరిగానే కనిపించింది. మరోవైపు చైనా మాంజాపై పోలీసులు నిఘాపెట్టడంతో దుకాణాల్లో ప్రజలు సాధారణ మాంజానే కొనుగోలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంక్రాంతి సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

Air Balloon Festival: హైదరాబాద్‍లో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

Next Story