- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ నన్ను టార్గెట్ చేస్తే కరీంనగర్‍లో దళిత కవాతు పెడతా: మందుల సామేల్
కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ (Mandula Samuel) వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుతోంది. తుంగతుర్తిలో మందుల సామేల్ అంతు చూస్తామని ఆయన్ను ఓడించి తీరుతామని బండి సంజయ్ హెచ్చరిస్తే, ఒక్కసారి వచ్చి చూడు నా తడాఖా ఏంటో చూపిస్తానంటూ మందుల సామేల్ కౌంటర్ ఇచ్చారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న డైలాగ్ వార్‍లో సోమవారం మరింత ముదిరింది. మరోసారి బండి సంజయ్‍పై తాజాగా మందుల సామేల్ ఫైర్ అయ్యారు.
కరీంనగర్‍లో దళిత కవాతు:
ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మందుల సామేల్.. నేను బ్రాహ్మణులను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడలేదన్నారు. మాకు భాష అర్థం కాదు అనే భావనతోనే మాట్లాడానని కానీ, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను మాట్లాడిన భాష బ్రాహ్మణుల ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. నేను గోదావరి పుష్కరాలకు వెళ్లి స్నానం చేసేవాడిని. బండి సంజయ్ నన్ను టార్గెట్ చేస్తే కరీంనగర్‍లో దళిత కవాతు పెడతానంటూ హెచ్చరించారు. టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్‍గా కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మందుల సామేల్ బ్రాహ్మణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ డైలాగ్ వార్‍కు కారణం అయ్యాయి.






