- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MIM అసలు రంగు బయటపడింది.. బండి సంజయ్ ఫైర్
అసెంబ్లీలో వందేమాతరం గేయం పాడుతుండగా ఎంఐఎం సభ్యుల వాకౌట్ చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శాసనసభలో వందేమాతరం గేయం పాడుతుండగా సభ నుంచి ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎంఐఎం సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. అసెంబ్లీలో ఎంఐఎం తీరు సరికాదన్నారు. వందేమాతరం పాడుతుండగా వాకౌట్ చేయడం సిగ్గుచేటని జాతీయ గేయానికి, భరతమాతకు ఇది అవమానం అన్నారు. ఈ చర్యతో మస్లిస్ అసలు రంగు బయటపడిందన్నారు.
తొలిరోజే ఎంఐఎం వర్సెస్ బీజేపీ:
ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా సమావేశాలు మొదలైన తొలిరోజే ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ గలాటా మొదలు కావడం ఆసక్తిగా మారింది. ఎంఐఎం సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ ఇది దేశాన్ని అవమానించడమేనని, ఎంఐఎం సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
బండి సంజయ్ నన్ను టార్గెట్ చేస్తే కరీంనగర్‍లో దళిత కవాతు పెడతా: మందుల సామేల్
Next Story






