Sajjanar: తప్పు లేకుంటే ఎందుకు పారిపోతున్నారు? NTV రిపోర్టర్ల అరెస్టుపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-14 12:52:56  IST  )

రాత్రికి రాత్రి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే రిపోర్టర్లను అరెస్టు చేశామని సజ్జనార్ స్పష్టం చేశారు.

Sajjanar: తప్పు లేకుంటే ఎందుకు పారిపోతున్నారు? NTV రిపోర్టర్ల అరెస్టుపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా ఐఏఎస్‍పై ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేశారనే కేసులో ఎన్ టీవీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నామని సిటీ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‍కు సహకరించకుండా రాత్రికి రాత్రే దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే తాము అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన సజ్జనార్.. రిపోర్టర్స్ నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నామన్నారు. సిట్ అంటేనే దర్యాప్తు అని ఇంకా నోటీసులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. రిపోర్టర్లు సక్రమంగా ఉంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఎన్టీవీ సీఈవో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? విచారణకు పిలిస్తే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. విచారణలో కీలకంగా ఉన్నవారు విచారణకు వస్తానని చెప్పి సెల్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారని, బ్యాంకాక్ పేరుతో బయటకు వెళ్తుంటే పట్టుకోకుండా ఉంటామా? తప్పు చేసిన ఎవరినైనా అరెస్టు చేస్తామన్నారు. విచారణకు సహకరించకుంటే ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా పట్టుకువచ్చి చట్టం ముందు ప్రవేశపెడతామన్నారు.

Read More... సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Next Story