- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వంతో చర్చలకు ఆర్టీసీ జేఏసీ సుముఖత.. ఓవర్ టూ సెక్రటేరియట్
ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సచివాలయానికి బయలుదేరారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నాయకులు చర్చల కోసం సచివాలయానికి (Secretariat) బయలుదేరారు. అయితే, అంతకు ముందు చర్చలకు వెళ్లే ముందు ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలు, కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ (Shanker Goud) మృతి చెందిన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జేఏసీ నాయకులు తీవ్రంగా చర్చించారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. భేటీ అనంతరం, జేఏసీ కీలక నేతలంతా కలిసి సచివాలయానికి తరలివెళ్లారు.
కానీ, ఐఏఎస్ అధికారుల కమిటీతో భేటీకి ఆర్టీసీ జేఏసీ నేతల నిరాకరిస్తున్నారు. నేరుగా మంత్రులతోనే భేటీ నిర్వహించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జేఏసీని చర్చలకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చల అనంతరం సానుకూల నిర్ణయం వెలువడుతుందని కార్మికులు ఆశిస్తున్నారు.
ఆర్టీసీకి మొదటి రోజు భారీ నష్టం.. సమ్మెతో డిపోలకే పరిమితమైన బస్సులు






