- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీకి మొదటి రోజు భారీ నష్టం.. సమ్మెతో డిపోలకే పరిమితమైన బస్సులు
ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సామాన్య ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సామాన్య ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా మొదటి రోజు నమ్మెతో సంస్థకు దాదాపుగా రూ.1.50 కోట్ల నష్టం జరిగినట్లు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. సమ్మె అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు బలవంతంగా ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపుగా 90 బస్సులను బలవంతంగా నడిపించారు. ఆర్టీసీ బస్సులపై దాడులు చేసిన ముగ్గురిపై కేసులు కూడా నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇబ్బందుల్లో ప్రయాణికులు..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో మొత్తం 8 ఆర్టీసీ బస్సు డిపోలు ఉన్నాయి. సమ్మెతో అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లలేదు. మూడు జిల్లాలో డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టగా వారికి ప్రతిపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఉదయం నుంచి డిపోల ముందు నాయకులు బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
మొదటి రోజు భారీ నష్టం..
సమ్మెతో మొదటి రోజు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఆర్టీసీ రూ.1.50 కోట్ల వరకు నష్టపోయినట్లు సంస్థ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సిద్దిపేటల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటిలో డ్రైవర్, కండక్టర్లు 2 వేల మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మెతో వారంతా విధులకు దూరం అయ్యారు. ఈ క్రమంలో బస్సులు డిపోలకే పరిమితం కాగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రైవేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను చేరవేశారు.
బలవంతంగా 90 బస్సులు
ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించడంతో పాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాగా, మహిళలు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడడానికి ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు 90 వరకు బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి దుబ్బాక డిపోల ప్రాం తంలో ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసిన వారిపై మూడు కేసులు నమోదయ్యాయి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, మొదటి రోజు కొన్ని బస్సులు నడిపించామని, రెండో రోజు నుంచి మరిన్ని బస్సుల ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆర్టీసీ అధికారులు చెప్పారు.
డ్రైవర్ కు రూ.1000, కండక్టరుకు రూ.800
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఇందులో బాగంగానే రోజువారీగా బస్సులు నడపడానికి తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల నియామకానికి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ కు రూ.1000, కండక్టర్ కు 800 చెల్లించనున్నామని, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్లు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు కండక్టర్లకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






