కొండా సుస్మిత ఆరోపణలపై స్పందించిన రోహిన్ రెడ్డి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-16 06:28:02  IST  )

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ అప్పుడప్పుడు తనవద్దకు వచ్చేవాడని చెప్పారు. డెక్కన్ సిమెంట్ అంశం గురించి చెబితే తాను ఇలాంటి వాటిలో వేలు పెట్టనని చెప్పినట్టు తెలిపారు.

కొండా సుస్మిత ఆరోపణలపై స్పందించిన రోహిన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ అప్పుడప్పుడు తనవద్దకు వచ్చేవాడని చెప్పారు. డెక్కన్ సిమెంట్ అంశం గురించి చెబితే తాను ఇలాంటి వాటిలో వేలు పెట్టనని చెప్పినట్టు తెలిపారు. తాను ఎలాంటి అసాంఘీక కార్యకలాపాల్లో తలదూర్చలేదని కావాలంటే విచారణకు సిద్ధమని అన్నారు. అంతే కాకుండా కొండా సుస్మిత ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటివద్ద బుధవారం హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌‌తో మాట్లాడేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లగా కొండా సుస్మిత వారిని అడ్డుకున్నారు. సుమంత్ డెక్కన్ సిమెంట్ వాళ్లను గన్‌తో బెదిరించాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేస్తే వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. కానీ పోలీసులు ఆధారాలు చూపించడంలేదని అన్నారు. రోహిన్ రెడ్డి పిలిస్తేనే సుమంత్ కలిసేందుకు వెళ్లాడని అన్నారు. సుమంత్ దగ్గర గన్ ఉంటే అది రోహిన్ రెడ్డే తీసుకువచ్చి ఉంటాడని, అతడిపై కూడా కేసు పెట్టాలని వ్యాఖ్యానించారు. వాళ్ల కాల్ డేటా బయటకు తీయాలని డిమాండ్ చేశారు.

Read More: కార్య‌క‌ర్త‌లు అధైర్య‌ప‌డొద్దు, నన్ను అరెస్ట్ చేస్తే ఖండించాలి.. కొండా సుస్మిత సెల్ఫీ వీడియో!

పర్యావరణ ప్రేమికుడి ఫిర్యాదు.. బ్లాక్ మెయిలింగ్ కు అస్త్రంగా మారిందా

Next Story