- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యావరణ ప్రేమికుడి ఫిర్యాదు.. బ్లాక్ మెయిలింగ్ కు అస్త్రంగా మారిందా
అటవీ సంపదను కొల్లగొడుతున్నారని పర్యావరణ ప్రేమికుడు న్యాయ పోరాటం ఇప్పుడు కొంత మంది పెద్దలకు బ్లాక్ మెయిలింగ్ కు అస్త్రంగా మారిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

దిశ, సిటీ క్రైమ్ : అటవీ సంపదను కొల్లగొడుతున్నారని పర్యావరణ ప్రేమికుడు న్యాయ పోరాటం ఇప్పుడు కొంత మంది పెద్దలకు బ్లాక్ మెయిలింగ్ కు అస్త్రంగా మారిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. తాజాగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంతో ఈ విమర్శలకు బలాన్ని ఇస్తున్నాయి. సూర్యపేట జిల్లాకు చెందిన పసుపులేటి సురేష్ పర్యావరణ ప్రేమికుడు గత 10 సంవత్సరాలుగా ఆయన పలు సిమెంట్ కంపెనీల్లో సివిల్ ఇంజనీర్ గా పని చేశాడు. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా పి.సురేష్ సివిల్ ఇంజినీర్ గా పని చేశాడు. ఆ సందర్భంలో కొన్ని నిర్మాణాలకు సివిల్ ఇంజినీర్ గా ఉన్న సురేష్ దక్కన్ సిమెంట్స్ యాజమాన్యం అక్రమంగా దాదాపు 100 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసి వారి ఆధీనంలోకి తీసుకుందని గుర్తించాడు. దీంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని గుర్తించిన సురేష్ తన ఉద్యాగానికి రాజీనామా చేసి అప్పటి నుంచి దక్కన్ సిమెంట్స్ మీద పోరాటం ప్రారంభించాడు.
ఇలా సురేష్ గత 6 సంవత్సరాల నుంచి దక్కన్ సిమెంట్స్ అటవీ భూమి కబ్జా పై నిరంతరం అనేక వేదికల మీద ఎండగడుతున్నాడు. దీంట్లో భాగంగా సరేష్ రాత పూర్వకంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి, సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఏడఈ మైన్స్ అండ్ జియోలాజీ, జిల్లా అటవీ శాఖ అధికారి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ , కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఇప్పటికి సురేష్ దక్కన్ సిమెంట్స్ కబ్జా చేసిన 100 ఎకరాల భూమికి విముక్తి కలిగించేందుకు అందరి వద్దకు తిరుగుతూనే ఉన్నాడు. తాజాగా మంత్రి కొండా సురేఖ ఓఎస్ డి సుమంత్ వ్యవహారం బయటపడడంతో సురేష్ అవాక్కయ్యాడు. తన ఫిర్యాదు పై న్యాయం చేయాలని ఆశిస్తే నా ఫిర్యాదును అడ్డంపెట్టుకుని ఇలా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం సమంజసం కాదని పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అటవీ చట్టాలు ఎంత బలంగా ఉన్నా 100 ఎకరాలు భూమిని కబ్జా చేసిన దక్కన్ సిమెంట్స్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు కూడా వెనకడుగు వేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తన పోరాటాన్ని ఆపనని దీనిని కొనసాగిస్తానని తెలిపారు. త్వరలో ఈ అటవీ కబ్జాలకు సంబంధించిన వ్యవహారాన్ని సీబీఐ, ఈడీ కి కూడా ఫిర్యాదు చేస్తానని సురేష్ తెలిపారు.
Read More.. కొండా సుస్మిత ఆరోపణలపై స్పందించిన రోహిన్ రెడ్డి






