తూప్రాన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

by Ramesh Naini |   (  Updated:2025-12-23 11:30:01  IST  )

తూప్రాన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్ జిల్లా తూప్రాన్ జాతీయ రహదారిపై మంగళవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న రెండు లారీలను ఓవర్‌టేక్ చేసేందుకు మరో లారీ డ్రైవర్ యత్నించిన క్రమంలో, మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదంలో ఎవరికైనా గాయాలు జరిగినాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉండగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

READ MORE ....

విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం.. ఏడేళ్ల చిన్నారి పైనుంచి వెళ్లిన సర్పంచ్ కారు

Next Story