విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం.. ఏడేళ్ల చిన్నారి పైనుంచి వెళ్లిన సర్పంచ్ కారు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-23 11:31:43  IST  )

సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న ఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం.. ఏడేళ్ల చిన్నారి పైనుంచి వెళ్లిన సర్పంచ్ కారు
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న ఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూడూరు (Pudur) మండల పరిధిలోని రాకంచర్ల (Rakamcharla) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా కమ్లిబాయ్ విజయం సాధించింది. దీంతో ఆమె అనుచరులు, మద్దతుదారులు సోమవారం రాత్రి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా భారీ డీజే సౌండ్‌తో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ కారు 7 ఏళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపైకి ఎక్కేసింది. ఈ దుర్ఘటనలో సౌజన్యకు తీవ్ర గాయాలు కాగా.. అక్కడున్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

READ MORE ....

తూప్రాన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

Next Story