- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RGIA: భారీ పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాల దారి మళ్లింపు
హైదరాబాద్ (Hyderabad)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు (Dense Fog) విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు (Dense Fog) విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (RGIA) విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో పైలట్లు విమానాలను ల్యాండ్ చేసేందుకు జంకతున్నారు. ఇప్పటికే శంషాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన సుమారు 14 విమానాలను అధికారులు బెంగళూరు, గన్నవరం, చెన్నై విమానాశ్రయాలకు దారి మళ్లించారు. అందులో దుబాయ్, మస్కట్, రియాద్, కువైట్ వంటి విదేశీ నగరాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, వారణాసి, విశాఖపట్నం, ముంబైకి వెళ్లాల్సిన సుమారు 19 విమాన సర్వీసులు రద్దు చేశారు. ముఖ్యంగా ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన అత్యధిక సర్వీసులపై ఈ ప్రభావం పడిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. మరో 10కి పైగా విమానాలు 2 నుంచి 4 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వారు, చిన్న పిల్లలు వృద్ధులు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు.
Read More..
హైవేలను కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 10 మీటర్ల కంటే తక్కువకు విజిబిలిటీ డౌన్






