- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేలను కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 10 మీటర్ల కంటే తక్కువకు విజిబిలిటీ డౌన్
వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. పగటిపూట చలి తీవ్రత తగ్గినప్పటికీ, తెల్లవారుజామున మాత్రం దట్టమైన పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. పగటిపూట చలి తీవ్రత తగ్గినప్పటికీ, తెల్లవారుజామున మాత్రం దట్టమైన పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రధాన హైవేలపై విజిబిలిటీ 10 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని రీతిలో పొగమంచు కమ్ముకోవడంతో డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. శంషాబాద్-బెంగళూరు (Shamshabad- Bengaluru), విజయవాడ-హైదరాబాద్ (Vijayawada-Hyderabad), ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసరాల్లో ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడటం లేదు. దీంతో రోడ్డు సరిగ్గా కనిపించక వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ఇటీవలే హైదరాబాద్-బెంగళూరు హైవేపై నాలుగు లారీలు వరుసగా ఢీకొనడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విమాన రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోలీసుల కీలక సూచనలు..
హైవేపై భారీగా పొగమంచు ఉండటంతో వాహనదారులకు పోలీసులు (Police), రవాణా శాఖ అధికారులు (Transport Department Officials) కీలక సూచనలు చేస్తున్నారు. వీలైనంత వరకు తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు హైవేలపై ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే చాలా నెమ్మదిగా, ఫాగ్ లైట్లు ఆన్ చేసి ప్రయాణించాలని పేర్కొన్నారు. ముందు వెళ్తున్న వాహనానికి కనీసం 50 మీటర్ల దూరం పాటించాలని సూచించారు. మంచు ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.






