- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రేవంత్ రెడ్డి గారు.. ఇదేనా మీరు చెప్పిన ఏడవ గ్యారంటీ?: హరీశ్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Secunderabad Municipal Corporation) సాధన కోసం మా పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు అని విమర్శించారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మీ నిర్బంధాలకు భయపడేది లేదన్నారు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఇవాళ భారీ శాంతి ర్యాలీకి సిద్ధమయ్యారు అయితే.. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్టు చేశారు.
Read More..






