- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలోని డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ ఆందోళనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ ఆందోళనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతుందని వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కూడా పనిచేస్తాయని తెలిపారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ సేవల్ని మరింత ఈజీగా పొందవచ్చని, మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని వివరించారు. ఈ నూతన విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలు పూర్తిగా ప్రజలకు నిరంతర, పారదర్శక సేవలు అందించడం కోసమేనని ఆయన వివరించారు. ప్రజల సౌకర్యార్థం ఈ సేవలను మరింత సులభతరం చేసేందుకు సాంకేతిక సంస్కరణలు చేపడుతున్నామని, వ్యవస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు దళారీల వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల్ని కొందరు తప్పుగా చూపిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.






