- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయం చేయొద్దు.. అయోధ్య విరాళాల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
అయోధ్య విరాళాల చోరీ కేసులో 'సిట్' పునర్వ్యవస్థీకరణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాల చోరీపై సమగ్ర దర్యాప్తు జరగాలని పేర్కొంది. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిసి సూర్యాకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిధుల దుర్వినియోగం,ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) పునర్వ్యవస్థీకరించాలనిఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటువంటి క్లిష్టమైన ఆర్థిక నేరాల దర్యాప్తులో మంచి అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారి ఆధ్వర్యంలో ఈ విచారణ జరగాలని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని, అయోధ్య విరాళాలపై రాజకీయాలు చేయొద్దని పార్టీలకు సూచించింది. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను యూపీ ప్రభుత్వం సమర్పించనున్న నేపథ్యంలో తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.






