ప్రపంచ రికార్డు సాధించిన సంగారెడ్డి చిన్నారి మాల్వే విహాన్

by Batti.Sumithra |

మార్షల్ ఆర్ట్స్‌లో విశేష ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి మాల్వే విహాన్‌ను, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ప్రపంచ రికార్డు సాధించిన సంగారెడ్డి చిన్నారి మాల్వే విహాన్
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : మార్షల్ ఆర్ట్స్‌లో విశేష ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి మాల్వే విహాన్‌ను, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విహాన్ తల్లిదండ్రులు రామేశ్వర్, అశ్విన్‌తో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న వయస్సులోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి సంగారెడ్డి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, వసంత్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారిని అభినందించారు.

Next Story