Delhi Liquor Scam: 'లిక్కర్ స్కాంలో కవితతో పాటు రేవంత్ రెడ్డి హస్తం'

by Javid Pasha |   (  Updated:2022-09-09 07:26:43  IST  )

Delhi Liquor Scam లో ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి..

Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవితతో పాటు రేవంత్ రెడ్డి హస్తం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందన్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

'ప్రగతి భవన్-గాంధీ భవన్ భాయ్ భాయ్' అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాటకాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించిందని పేర్కొన్నారు. ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్, గాంధీ భవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలిందని ఆరోపించారు. తెర ముందు పోరాటం తెర వెనుక వ్యాపారం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి చీకటి కోణం బయటపడిందని స్పష్టం చేశారు. దీంతో, కోమటిరెడ్డి ట్వీట్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరో చర్చకు దారి తీసింది కాగా, ఇప్పటికే బీజీపీ నేతలు కవిత, రేవంత్‌లపై ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read : బిగ్ బ్రేకింగ్.. కవిత సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు?

Also Read : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన AICC


Next Story