మునుగోడు Congress అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన AICC

by GSrikanth |   (  Updated:2022-09-09 07:34:47  IST  )

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

మునుగోడు Congress అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన AICC
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పాలని, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల కంటే మునుగోడులోని చండూరులో భారీ బహిరంగ సభ పెట్టి, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. మరి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుందో లేదో చూడాలి..

Also Read : Delhi Liquor Scam: 'లిక్కర్ స్కాంలో కవితతో పాటు రేవంత్ రెడ్డి హస్తం'

Next Story