- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం విఫలం : BJLP నేత మహేశ్వర్ రెడ్డి
రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటివరకు 20 శాతం కూడా ధాన్యం సేకరణ చేయలేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

- దళారులకు రైతులు అమ్మేలా ఆలస్యంగా సేకరణ
- ఇప్పటి వరకు 20 శాతం కొనుగోలు చేయకపోవడం దారుణం : బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటివరకు 20 శాతం కూడా ధాన్యం సేకరణ చేయలేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించేందుకు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం చేపడుతున్నట్లు, చేవెళ్ల నియోజకవర్గం నుంచి కుల్కచర్లలో ధాన్యం కేంద్రాలు మొదటి రోజు పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పవార్, పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ మల్కకొమురయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 141 ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పి ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి 80 శాతం కొనుగోలు చేసినట్లు ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బస్తాకు 4 కిలోలు తరుగు పేరుతో దోచుకుంటున్నారని, ఒకవేళ 90 లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలు చేస్తే అందులో 9 లక్షల మెట్రిక్‌టన్నుల కోత పెట్టిన ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలో పోతాయో చెప్పాలని నిలదీశారు. వరంగల్డ్లికరేషన్పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుందని, రైతు భరోసా సకాలంలో పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. ఒకవైపు ఆకాల వర్షాలు కురిసి ధాన్యం తడుస్తుందనే భయంతో రైతులు దళారులకు అమ్ముకునే పరిస్ధితి వచ్చిందన్నారు. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, శనగలు వంటి పంటలను సక్రమంగా కొనుగోలు చేయడం లేదని, కేంద్రం పరిమితి విధించిందని అబద్ధాలు ప్రచారం చేస్తూ రైతులు బ్రోకర్లకు ధాన్యం అమ్మేలా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఏరాష్ట్రానికి ఇవ్వని నిధులు ఇస్తుందని, ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుందని మండిపడ్డారు. యూరియా కేటాయింపులు, యంత్రాలకు సబ్సిడీ వంటి ఏటా రైతులకు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. రైతు గోస యాత్ర చేపట్టి రేవంత్ప్రభుత్వం రైతులను చేసే మోసాలను ఎండ గడుతామని హెచ్చరించారు.






