- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగుల యత్నం.. బక్క జడ్సన్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ వివిధ సంఘాలు తమ సమస్యలను ఎత్తి చూపేందుకు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ వివిధ సంఘాలు తమ సమస్యలను ఎత్తి చూపేందుకు అసెంబ్లీ ముట్టడికి (Assembly siege) ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు (Retired employees) సోమవారం తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా 2024 నుండి ప్రభుత్వం పెన్షన్ దారులకు చెల్లించాల్సిన కరువు భత్యం (DA), ఇతర పాత బకాయిలను విడుదల చేయడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్ డీఏలను (Pending DAs) మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బక్క జడ్సన్ (Buck Judson) సహా పలువురు రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెన్షన్ దారుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తక్షణమే తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read More..
అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం.. విద్యా సంస్థల్లో సంక్షోభంపై చర్చకు పట్టు






