- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం.. విద్యా సంస్థల్లో సంక్షోభంపై చర్చకు పట్టు
నాలుగో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, అంతకు ముందే బీజేపీ (BJP) శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో నెలకొన్న సంక్షోభంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం (Adjournment Motion) అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు పీజీ యూనివర్సిటీల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని, దీనికి మౌలిక వసతుల లేమే కారణమని ఆరోపించారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు కాలేజీలను నడపలేకపోతున్నాయని, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక విద్యాసంస్థలను మూసివేస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. చదవు పూర్తి అయినా.. సర్టిఫికెట్లు చేతికి అందక ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు విద్యార్థులు దూరమవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుల నినాదాలు
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే బీజేపీ సభ్యులు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో నెలకొన్న సంక్షభం సభలో చర్చించాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. అయితే, స్పీకర్ వారి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది.
Read More..
ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 10 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్‌లు






